Ayyan App: అయ్యప్ప భక్తులకు అందుబాటులోకి ‘అయ్యన్’ యాప్
- భక్తుల సౌకర్యార్థం యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన కేరళ అటవీ శాఖ
- తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో యాప్
- యాప్‌లో శబరిమల మార్గంలోని పలు సేవ, హెల్త్ కేంద్రాల వివరాలు
- వన్యప్రాణుల దాడులప్పుడు యాప్‌తో అధికారులను సంప్రదించే సౌలభ్యం
శబరిమల అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్థం కేరళ అటవీ శాఖ ‘అయ్యన్’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో యాప్‌ను సిద్ధం చేసింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో పనిచేసేలా రెడీ చేసిన ఈ యాప్ ద్వారా అయ్యప్ప భక్తులు పలు సేవలు పొందవచ్చు. శబరిమల వెళ్లే మార్గంలో సేవా కేంద్రాలు, హెల్త్ ఎమర్జెన్సీ, వసతి సౌకర్యాలు, ఏనుగులు సంచరించే ప్రాంతాలు, ఫైర్ ఫోర్స్, పోలీస్ ఎయిడ్ పోస్టులు, తాగునీటి కేంద్రాల వివరాలను ఈ యాప్‌లో పొందుపరిచారు. అటవీ మార్గంలో వన్యప్రాణుల దాడులు జరిగిన సందర్భాల్లో యాప్ ద్వారా అధికారులను సంప్రదించవచ్చని కేరళ అటవీ శాఖ పేర్కొంది. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.