IMD: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
- అండమాన్ సముద్రం, మలక్కా జలసంధిని ఆనుకుని అల్పపీడనం
- ఈ నెల 29 నాటికి వాయుగుండం
- డిసెంబరు 1 కల్లా తుపానుగా బలపడే అవకాశం
అండమాన్ సముద్రం, మలక్కా జలసంధిని ఆనుకుని అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని, ఈ నెల 29 నాటికి వాయుగుండంగా బలపడనుందని తెలిపింది. అక్కడ్నించి వాయవ్య దిశగా పయనించి 48 గంటల్లో తుపానుగా మారుతుందని ఐఎండీ వివరించింది. దీని ప్రభావం డిసెంబరు 1 నుంచి భారత తీర ప్రాంతంపై కనిపిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి అల్పపీడన ప్రభావం అండమాన్ దీవులపై అధికంగా ఉండనుంది.