Etela Rajender: బీఆర్ఎస్ కండువా వేసుకోకుంటే తెలంగాణ గడ్డమీద బతకనివ్వమని బెదిరించే పరిస్థితి ఉంది: ఈటల విమర్శలు

Etala Rajender in Gajwel SC athmeeya Sammelanam

  • దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదన్న ఈటల
  • పేదల వద్ద ఉన్న భూములు లాక్కున్నారని ఆరోపణ
  • కేసీఆర్ పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్నారని విమర్శలు

బీఆర్ఎస్ కండువా వేసుకోకుంటే వారిని తెలంగాణ గడ్డమీద బతకనివ్వం.. కేసులు పెడతామని బెదిరించే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన ఎస్సీ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అధికారంలోకి వస్తే దళిత ముఖ్యమంత్రి అని చెప్పి మాట నిలబెట్టుకోలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశారని విమర్శించారు. భూమి ఇవ్వకపోగా... పైగా పేదల వద్ద ఉన్న భూములను లాక్కున్నారని ఆరోపించారు. రూ.10 లక్షల పరిహారం ఇచ్చి కోట్లాది రూపాయలకు అమ్ముకున్నారని ధ్వజమెత్తారు.

కొండపాక కలెక్టర్ కార్యాలయం కోసం 250 ఎకరాల భూమి అవసరమైతే 350 ఎకరాలు తీసుకున్నారని, మిగిలిన భూమిని ప్లాట్లు చేసుకొని అమ్ముకున్నారని ఆరోపించారు. కేసీఆర్ పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్నారని ధ్వజమెత్తారు. కోట్లాది రూపాయల విలువ చేసే భూములు పేదలకు ఉండకూడదనే కేసీఆర్ అలా చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేసిన అభివృద్ధిని తన ఖాతాలో వేసుకోవడం దారుణమన్నారు.

  • Loading...

More Telugu News