Vishal: జీవితంలో సీబీఐ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు: హీరో విశాల్
- మార్క్ ఆంటోని విడుదల సమయంలో సంచనల ఆరోపణలు చేసిన విశాల్
- ముంబయిలో సెన్సార్ బోర్డు వ్యక్తులకు లంచం ఇచ్చానని వెల్లడి
- నేడు సీబీఐ కార్యాలయానికి వెళుతున్నట్టు ట్వీట్ చేసిన విశాల్
మార్క్ ఆంటోని సినిమాను హిందీలో విడుదల చేసేందుకు సెన్సార్ బోర్డులో కొందరు వ్యక్తులకు లంచం ఇవ్వాల్సి వచ్చిందని హీరో విశాల్ కొన్ని నెలల కిందట సంచలన ఆరోపణలు చేశారు. ముంబయిలోని సీబీఎఫ్ సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) లో తాను ఎవరికి డబ్బులు ఇచ్చిందీ, ఎంత ఇచ్చిందీ, వారి అకౌంట్ నెంటర్లను కూడా విశాల్ సోషల్ మీడియాలో పెట్టారు. స్క్రీనింగ్ కోసం రూ.3 లక్షలు, సర్టిఫికేషన్ కోసం మరో రూ.3.5 లక్షలు ఇవ్వాల్సి వచ్చిందని వాపోయారు.
తాజాగా, విశాల్ ఈ వ్యవహారానికి సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. ఇవాళ ముంబయిలోని సీబీఐ కార్యాలయానికి వెళుతున్నానని వెల్లడించారు. సీబీఎఫ్ సీ కేసుకు సంబంధించిన విచారణ కోసం వెళుతున్నానని తెలిపారు. జీవితంలో సీబీఐ ఆఫీసుకు వెళ్లాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని విశాల్ పేర్కొన్నారు.