Chandrababu: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరు చేర్చాలంటూ ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్... సుప్రీంలో విచారణ వాయిదా

Supreme Court adjourns hearing on cash for vote case petitions filed by MLA Alla Ramakrishnareddy
  • తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు
  • సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేసిన ఆర్కే
  • ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వినతి
  • విచారణ వాయిదా కోరిన చంద్రబాబు న్యాయవాది లూథ్రా
  • రెండు వారాలు వాయిదా వేసిన సుప్రీం ధర్మాసనం
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పేరును కూడా చేర్చాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. అంతేకాదు, ఈ కేసును సీబీఐకి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా ఆర్కే మరో పిటిషన్ వేశారు. దర్యాప్తులో ఏసీబీ విఫలమైందని, అందుకే సీబీఐకి అప్పగించాలని కోరారు. 

ఈ పిటిషన్లపై సుప్రీం ద్విసభ్య ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. అయితే, విచారణను వాయిదా వేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా విజ్ఞప్తి చేశారు. లూథ్రా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. 

ఓటుకు నోటు కేసును తెలంగాణ ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జైలుకు కూడా వెళ్లొచ్చారు.
Chandrababu
Cash For Vote
Alla Ramakrishnareddy
Petition
Supreme Court
CBI
ACB
Andhra Pradesh
Telangana

More Telugu News