Telangana Assembly Election: తెలంగాణ ఎన్నికలు.. కొన్ని చోట్ల మొరాయిస్తున్న ఈవీఎంలు

EVM malfunctions causing troubles in some polling booths in Telangana
  • రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పోలింగ్
  • ఓటేసేందుకు తరలివస్తున్న ప్రజలు
  • సిద్దిపేట, నిజామాబాద్ సూర్యాపేట, నాగార్జునసాగర్‌లో మొరాయించిన ఈవీఎంలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు తరలివస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు, సినీతారలు ఓటేసి వెళ్లారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయిస్తుండటంతో ఆటంకాలు ఎదురవుతున్నాయి. సిద్దిపేటలోని అంబి టస్ స్కూల్లో మోడల్ పోలింగ్ బూత్ నెం.118 లో ఈవీఎం మొరాయించింది. మాక్ పోలింగ్ సజావుగా సాగినా, పోలింగ్ ప్రారంభమయ్యాక సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది. 

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నందిపేట మండల కేంద్రంలో ఉన్న 167 నెం.పోలింగ్ బూత్‌, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ బూత్ నెంబర్ 89,  నాగార్జునసాగర్ 103 నెం.పోలింగ్ బూత్‌లో ఈవీఎంల కారణంగా ఆటంకాలు ఎదురయ్యాయి. ఫలితంగా కొన్ని చోట్ల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.
Telangana Assembly Election
EVM
BRS
Congress
BJP

More Telugu News