Daggubati Purandeswari: నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్తతపై పురందేశ్వరి ఫైర్.. ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేందుకేనని వ్యాఖ్య
- ఎన్నికల వేళ నీటి ఆలోచన రావడం ఓట్లకోసమేనని ఆరోపణ
- ఇది ఘోరాతి ఘోరమని మండిపాటు
- 400 మండలాల కరవును 100 మండలాలకే పరిమితం చేశారని ఆగ్రహం
నాగార్జున సాగర్ డ్యామ్‌ను గత అర్ధరాత్రి ఏపీ పోలీసులు తమ అధీనంలోకి తీసుకోవడం, తదనంతర పరిణామాలతో ఉద్రిక్తత నెలకొనడంపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ నీటి ఆలోచన రావడం ఓట్లకోసమేనని ఆరోపించారు. ఇది ఘోరాతి ఘోరమని మండిపడ్డారు.
ఇది రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టే ఘటన తప్ప మరోటి కాదన్నారు. నాలుగు వందల మండలాల్లో కరవు ఉంటే వంద మండలాలకే దానిని పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరవు గురించి అధికారులు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. వ్యవసాయశాఖ మంత్రి ఎవరో తెలియక ప్రజలు ఆయన కోసం వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఈ ఘటనపై విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న వేళ ఓట్ల కోసం వేసిన ఎత్తుగడ తప్ప మరోటి కాదని ఆరోపించారు.