allu arvind: ఓటు వేయకుంటే నీకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉండదు: అల్లు అరవింద్
- ఓటు వేసిన సినీ నిర్మాత అల్లు అరవింద్
- ఏం ఓటేద్దాంలే అని ఇంట్లో కూర్చోవద్దని సందేశం
- ఈ రోజు సెలవు కాబట్టి బీరు తాగి పడుకుందామని అనుకోవద్దని వ్యాఖ్య
నీవు ఓటు వేయకుంటే నీకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉండదని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఆయన జూబ్లీహిల్స్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏం ఓటేద్దాంలే అని ఇంట్లో కూర్చునే వారికి తాను ఈ సందేశాన్ని ఇస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు సెలవు దినమే కాబట్టి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఇవాళ హాలీడే కాబట్టి బీరు తాగి పడుకుందామని అనుకోవద్దని హితవు పలికారు.