vote: ఓటు వేసేందుకు ఆవు మీద వచ్చిన గ్రామస్తుడు

Man rides on cow to cast his vote
  • నెట్టింట వైరల్ గా మారిన వీడియో
  • అదిలాబాద్ జిల్లా తానూరు మండలం మహలింగ గ్రామంలో ఘటన 
  • వేరే ఊళ్లో ఉంటున్న మహలింగ ఓటు కోసం  గ్రామానికి రాక  
ఎన్నికల వేళ ఓ వ్యక్తి ఓటు వేసేందుకు ఆవు మీద వచ్చిన సంఘటన ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అదిలాబాద్ జిల్లా తానూరు మండలం మహలింగ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తమ గ్రామంలో కాకుండా వేరే చోట నివాసం ఉంటున్నాడు. ఈ రోజు పోలింగ్ నేపథ్యంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి తన సొంత గ్రామానికి ఆవు పైన వచ్చాడు. ఆవు మీద వచ్చి ఓటు వేశాడంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
vote
Telangana Assembly Election
Hyderabad

More Telugu News