Telangana Assembly Election: 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్... క్యూలో నిలిచిన వారికి ఓటు వేసే అవకాశం

polling has ended in 13 assembly constituencies
  • సాయంత్రం నాలుగు గంటలకు ముగిసిన పోలింగ్
  • సమస్యాత్మక నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్
  • మిగతా 106 స్థానాల్లో ఐదు గంటలకు ముగియనున్న పోలింగ్
తెలంగాణలోని పదమూడు నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. సమస్యాత్మక నియోజకవర్గాలలో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ ఉంటుంది. అయితే 4 గంటల లోపు పోలింగ్ కేంద్రానికి వచ్చి క్యూలో నిలిచిన వారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, అసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. రాష్ట్రంలోని మిగతా 106 స్థానాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.
Telangana Assembly Election
polling
Telangana

More Telugu News