Ram Charan: జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన రామ్ చరణ్, మహేశ్ బాబు

Ram Charan and Mahesh Babu cast their vote in Jubilee Hills polling station
  • నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
  • ఉత్సాహంగా పోలింగ్ బూత్ లకు తరలివస్తున్న సెలబ్రిటీలు
  • ఉపాసనతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న రామ్ చరణ్
  • నమ్రతతో కలిసి వేలిపై ఇంకు గుర్తు చూపుతూ మహేశ్ బాబు ట్వీట్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 119 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ చేపట్టారు. కాగా, సెలబ్రిటీలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మధ్యాహ్నం తర్వాత రామ్ చరణ్, మహేశ్ బాబు కూడా ఓటు వేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన అర్ధాంగి ఉపాసనతో కలిసి జూబ్లీహిల్స్ పోలింగ్ బూత్ వద్దకు వచ్చారు. చరణ్ రాకతో పోలింగ్ కేంద్రం వద్ద సందడి నెలకొంది. రామ్ చరణ్, ఉపాసన ఓటేసిన అనంతరం అక్కడ్నించి వెళ్లిపోయారు. 

అటు, మహేశ్ బాబు, నమ్రత దంపతులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటేసిన అనంతరం వేలికి ఇంకు గుర్తును చూపుతూ మహేశ్ బాబు సోషల్ మీడియాలో స్పందించారు. మేం ఓటు వేశాం... మీరు కూడా ఓటేయండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
Ram Charan
Mahesh Babu
Vote
Upasana
Namrata
Jubilee Hills
Hyderabad
Telangana Assembly Election
Tollywood

More Telugu News