Rahul Dravid: కాంట్రాక్టు పొడిగింపు పత్రాలు నాకింకా అందలేదు: ద్రావిడ్

Dravid talks about contract extension

  • టీమిండియా కోచ్ గా ద్రావిడ్ కాంట్రాక్టును పొడిగించినట్టు బీసీసీఐ వెల్లడి
  • తానింకా కాంట్రాక్టు పత్రాలపై సంతకం చేయలేదన్న ద్రావిడ్
  • పత్రాలు అందిన తర్వాత స్పందిస్తానని వివరణ 

టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్టును పొడిగించినట్టు బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై రాహుల్ ద్రావిడ్ ను మీడియా వివరణ కోరింది. కాంట్రాక్టు పొడిగింపు పత్రాలపై తాను ఇంకా సంతకం చేయలేదని వెల్లడించారు. ఆ పత్రాలు తనకు ఇంకా అందలేదని తెలిపారు. ఆ పత్రాలు అందిన తర్వాత తదుపరి నిర్ణయం ఉంటుందని వివరించారు. 

కాగా, ద్రావిడ్ కోచ్ గా వచ్చాక టీమిండియా అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానానికి చేరింది. ఐసీసీ టోర్నీల్లో టైటిళ్లు గెలవనప్పటికీ, ఆయా ఈవెంట్లలో టీమిండియా ప్రదర్శన పరంగా మంచి మార్కులే పడ్డాయి. నిర్ణాయక మ్యాచ్ ల్లో ఓటమిపాలవడం తప్పించి, టీమిండియా ఆటతీరును ఎవరూ వేలెత్తిచూపలేని పరిస్థితి ఉంది. 

ముఖ్యంగా, ద్రావిడ్ గత రెండేళ్లుగా టీమిండియాను పటిష్ఠం చేసిన తీరు బీసీసీఐని ఆకట్టుకుంది. అందుకే, ఈ వరల్డ్ కప్ తో ద్రావిడ్ కాంట్రాక్టు ముగిసినా, అతడివైపే మొగ్గు చూపుతోంది. ద్రావిడ్ కాకుండా మరొకరు కోచ్ గా వస్తే, ద్రావిడ్ నెలకొల్పిన టీమ్ వాతావరణ దెబ్బతింటుందని బోర్డు ఆందోళన చెందుతోంది. మరికొన్నాళ్ల పాటు ద్రావిడ్ మార్గదర్శనంలోనే జట్టు ముందుకు సాగితే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు.  

  • Loading...

More Telugu News