Nityananda Swamy: నిత్యానంద స్వామి దెబ్బకు పదవి కోల్పోయిన పరాగ్వే దేశ మంత్రి
- ఒక ద్వీపంలో కైలాస అనే దేశాన్ని ఏర్పాటు చేసుకున్న నిత్యానంద
- పరాగ్వే మంత్రిని నమ్మించి ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్న కైలాస ప్రతినిధులు
- గుర్తింపు లేని దేశంతో ఒప్పందం చేసుకున్నందుకు పదవి కోల్పోయిన మంత్రి
స్వయం ప్రకటిత దేవుడు నిత్యానంద స్వామి ప్రస్తుతం ఒక చిన్న ద్వీపంలో కైలాస అనే సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయన దెబ్బకు పరాగ్వే దేశానికి చెందిన వ్యవసాయ మంత్రి అర్నాల్డో చామొరో తన పదవిని కోల్పోయారు. గుర్తింపు లేని దేశంతో ఒప్పందం చేసుకున్నారనే కారణంతో ఆయన పదవిని కోల్పోవాల్సి వచ్చింది.
ఈ సందర్భంగా అర్నాల్డో మీడియాతో మాట్లాడుతూ... తమ దేశం దక్షిణ అమెరికాకు చెందిన ఒక ద్వీపం అని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధులు తనకు చెప్పారని తెలిపారు. పర్వాగ్వేకు మేలు చేయాలనే భావనతో వచ్చామని చెప్పారని... పలు ప్రాజెక్టుల గురించి వివరించారని చెప్పారు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ఒప్పందంపై అర్నాల్డో సంతకాలు చేశారు. దీంతో, ఆయనపై వేటు పడింది. గుర్తింపు లేని దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు కుదుర్చుకున్నారని వేటు వేశారు.