Team India: ఆసీస్ తో నాలుగో టీ20... 63 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా
- రాయపూర్ లో నాలుగో టీ20 మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
- టీమిండియాకు మొదట బ్యాటింగ్
- 13 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు డౌన్
టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నేడు నాలుగో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కు రాయ్ పూర్ లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 63 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. కేవలం 13 పరుగుల వ్యవధిలో జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ల వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 37 పరుగులు చేసి ఆరోన్ హార్డీ బౌలింగ్ లో అవుటయ్యాడు. జైస్వాల్ స్కోరులో 6 ఫోర్లు, 1 సిక్సు ఉన్నాయి.
వన్ డౌన్ లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 8 పరుగులకే వెనుదిరిగాడు. ఈ వికెట్ ఆసీస్ యువ లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘాకు దక్కింది. ఇక, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈసారి స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ఆసీస్ లెఫ్టార్మ్ పేసర్ డ్వార్షూయిస్ విసిరి అవుట్ స్వింగర్ ను ఆడబోయిన సూర్యకుమార్ యాదవ్ వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు.
ప్రస్తుతం టీమిండియా స్కోరు 9 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 70 పరుగులు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 12 పరుగులతోనూ, రింకూ సింగ్ 6 పరుగుతో క్రీజులో ఉన్నారు.