Ayodhya Ram Mandir: అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠకు 6000 మంది అతిథులు

Shri Ram Janmabhoomi Trust initiates invitation process for 6000 dignitaries for Pran Pratishtha
  • జనవరి 22న అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం
  • దేశం నలుమూలల నుంచి హాజరు కానున్న సాధుసంతులు
  • పోస్టు ద్వారా తొలి ఆహ్వానపత్రిక అందుకున్న మహంత్ విష్ణుదాస్
అయోధ్యలో నిర్మించిన రామాలయంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి 600 మంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు శ్రీరాం జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పోస్టు ద్వారా అందరికీ ఆహ్వానాలు పంపింది. జనవరి 22న అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరగనుంది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకానున్న వారిలో సాధు సంతులు, ప్రధాని నరేంద్రమోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా పలువురు వీవీఐపీలు ఉన్నారు.

పోస్టు ద్వారా ఆహ్వానపత్రికలు పంపడంతోపాటు వాట్సాప్ ద్వారా పీడీఎఫ్ ఫైళ్లు కూడా పంపించారు. అతిథులు తమ ఆధార్ కార్డులను విధిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయోధ్య సాధువులు అతిథులను సాదరంగా ఆహ్వానిస్తారు. మెగా ప్రాణ ప్రతిష్ఠకు రాముడి ఆశీర్వాదంతో తనకు తొలి ఆహ్వాన పత్రిక అందిందని మహంత్ విష్ణుదాస్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి సాధుసంతులు వస్తున్నట్టు తెలిపారు.
Ayodhya Ram Mandir
Shri Ram Janmabhoomi Trust
Ram Lalla
Mega Pran Pratishtha

More Telugu News