Palnadu: ఎదురింటి వ్యక్తితో గొడవ.. సీసీరోడ్డుపై మూడు అడుగుల ఎత్తులో గోడ కట్టేశాడు!
- పల్నాడు జిల్లా, శావల్యాపురం మండలం కారుమంచిలో ఘటన
- పొరుగింటి వ్యక్తి రోడ్డుపైకి మెట్లు కట్టడంపై అభ్యంతరం
- అతడు మురుగు కాల్వపై మెట్లు కట్టడంపై ఈయన అభ్యంతరం
- చివరికి రోడ్డుపై వెలసిన గోడ
ఇరుగుపొరిగిళ్ల మధ్య మనస్పర్థలు, చిన్నపాటి గొడవలు సర్వసాధారమే. కొన్ని సందర్భాల్లో మాత్రం ఇవి కక్షలు కార్పణ్యాలకు దారితీస్తుంటాయి. పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచిలో మాత్రం ఈ గొడవ ఏకంగా రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది. గ్రామానికి చెందిన కిలారు లక్ష్మీనారాయణ, కిలారు చంద్రశేఖర్ ఇళ్లు ఎదురెదురుగా ఉన్నాయి. మధ్యలో సీసీరోడ్డు ఉంది.