Cyclone Michaung: తుపాను వస్తోంది... అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్

CM Jagan reviews cyclone measures
  • నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
  • రాగల 12 గంటల్లో తుపానుగా మారే అవకాశం
  • నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం
  • ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు సీఎం జగన్ సూచనలు
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడుతోంది. ఇది నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటనుందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. తుపాను రాష్ట్రం దిశగా వస్తోందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. 

సహాయ కార్యక్రమాలు చేపట్టాలని ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. విద్యుత్, రవాణాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించాలని తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తుపాను శిబిరాల్లో ఆహారం, తాగునీరు, పాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.

తుపాను నేపథ్యంలో 8 జిల్లాలకు ముందస్తుగా నిధులు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. తిరుపతి జిల్లాకు రూ.2 కోట్లు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, కోనసీమ, పశ్చిమ గోదావరి, బాపట్ల, కాకినాడ జిల్లాలకు రూ.1 కోటి చొప్పున విడుదల చేస్తున్నట్టు తెలిపారు.
Cyclone Michaung
CM Jagan
Andhra Pradesh
Bay Of Bengal
IMD

More Telugu News