KTR: సిరిసిల్లలో కేటీఆర్ కు స్పష్టమైన ఆధిక్యం... కోరుట్లలో ధర్మపురి అర్వింద్ వెనుకంజ
- తెలంగాణలో కొనసాగుతున్న కౌంటింగ్
- సిరిసిల్లలో పూర్తయిన 3 రౌండ్ల లెక్కింపు
- 2,621 ఓట్ల ఆధిక్యంలో కేటీఆర్
- కోరుట్లలో రెండో స్థానంలో కొనసాగుతున్న అర్వింద్
తెలంగాణ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, 3వ రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి కేటీఆర్ 2,621 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కేటీఆర్ కు 10,199 ఓట్లు లభించగా, కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి 7,578 ఓట్లు పొందారు. బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమకు 2,763 ఓట్లు వచ్చాయి.
అటు, జగిత్యాల జిల్లా కోరుట్లలో రెండో రౌండ్ ముగిసేసరికి అధికార బీఆర్ఎస్ 120 ఓట్ల స్వల్ప ఆధిక్యం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ కు 7,374 ఓట్లు... బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ (ఎంపీ)కు 6,168 ఓట్లు... కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నర్సింగ్ రావుకు 3,990 ఓట్లు లభించాయి.