KCR: కామారెడ్డిలో రేవంత్ ను అధిగమించిన సీఎం కేసీఆర్

KCR get into lead in Kamareddy
  • కామారెడ్డిలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
  • నాలుగు రౌండ్ల పాటు రేవంత్ ఆధిక్యం
  • ఐదో రౌండ్ లో పుంజుకున్న సీఎం కేసీఆర్
కామారెడ్డి నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు అత్యంత ఆసక్తికరంగా మారింది. తొలుత కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఆధిక్యంలో ఉండగా, ఆ తర్వాత సీఎం కేసీఆర్ పుంజుకున్నారు. ఐదో రౌండ్ కు వచ్చేసరికి రేవంత్ రెడ్డిని కేసీఆర్ అధిగమించారు. కామారెడ్డిలో ఐదో రౌండ్ ముగిసేసరికి సీఎం కేసీఆర్ కు 660 ఓట్ల ఆధిక్యం లభించింది. నాలుగో రౌండ్ వరకు రేవంత్ ముందంజలో ఉన్నప్పటికీ, ఐదో రౌండ్ లో మొగ్గు కేసీఆర్ వైపు కనిపించింది. బీఆర్ఎస్ కు 3,461 ఓట్లు... కాంగ్రెస్ కు 2801 ఓట్లు... బీజేపీకి 2,334 ఓట్లు లభించాయి. అటు, గజ్వేల్ నియోజకవర్గంలోనూ కేసీఆర్ ముందంజలో ఉన్నారు. మూడు రౌండ్ల అనంతరం కేసీఆర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
KCR
Kamareddy
Revanth Reddy
BRS
Congress

More Telugu News