Singireddy Niranjan Reddy: వనపర్తిలో మంత్రి నిరంజన్ వాహనంపై దాడి!
- వనపర్తిలోనూ గెలుపు దిశగా కాంగ్రెస్
- 13వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థికి భారీ ఆధిక్యం
- కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగిన మంత్రి నిరంజన్ రెడ్డి
- మంత్రి వాహనంపై చెప్పులు, రాళ్లు!
వనపర్తిలో కాంగ్రెస్ విజయం దాదాపుగా ఖాయమైంది. దాంతో, బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి నిరంజన్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు. ఈ సందర్భంగా ఆయన వాహనంపై దాడి జరిగింది. కొందరు వ్యక్తులు వెళ్లిపోతున్న నిరంజన్ రెడ్డిపై చెప్పులు, రాళ్లు విసిరారు. దాంతో అక్కడ ఓ మోస్తరు ఉద్రిక్తత నెలకొంది.
వనపర్తి నియోజకవర్గం 13వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి నిరంజన్ రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. అప్పటికి కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి 12,343 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ సరళిపై మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. తాము పనులు చేసిన చోట, చేయని చోట ప్రజలు ఒకేలా స్పందించారని అభిప్రాయపడ్డారు. తాను అధికారంలో ఉన్నన్నాళ్లు వందేళ్లకు సరిపడా అభివృద్ధి పనులు చేశానని చెప్పుకొచ్చారు.