Ramcharan: మైసూరు చాముండేశ్వరి ఆలయంలో రామ్ చరణ్

Ram Charan in Mysore Chamundeswari temple
  • మైసూరులో షూటింగ్ జరుపుకుంటున్న 'గేమ్ ఛేంజర్'
  • చిత్ర యూనిట్ తో పాటు చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న చెర్రీ
  • 'గేమ్ ఛేంజర్'లో చెర్రీ సరసన కియారా అద్వానీ, అంజలి
టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ మైసూరులోని చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ప్రస్తుతం రామ్ చరణ్ తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్' మైసూరులో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర బృందంతో కలిసి ఆలయానికి చరణ్ వెళ్లారు. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు, తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు చరణ్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ కు వచ్చారు. ఓటు వేసిన తర్వాత ఆయన మళ్లీ షూటింగ్ కోసం మైసూరుకు వెళ్లిపోయారు.
Ramcharan
Tollywood
Mysore
Game Changer Movie

More Telugu News