Rashmika Mandanna: ఇన్ స్టాగ్రామ్ లో రష్మికకు 40 మిలియన్ల ఫాలోవర్లు

Rashmika gets 40 million followers on Instagram
  • 'ఛలో' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయిన రష్మిక మందన్న
  • వరుస హిట్లతో స్టార్ డమ్
  • 'పుష్ప' చిత్రంతో విపరీతమైన క్రేజ్
అందాలభామ రష్మిక మందన్న సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. రష్మికను ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే వారి సంఖ్య 40 మిలియన్లకు చేరింది. 'ఛలో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ కన్నడ భామ కొద్దికాలంలోనే అగ్రహీరోల సరసన నటించే స్థాయికి ఎదిగింది. 

గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప చిత్రాలతో రష్మిక స్టార్ డమ్ అమాంతం పెరిగిపోయింది. 'వారిసు' చిత్రంతో తమిళంలోనూ హిట్ కొట్టిన ఈ స్లిమ్ బ్యూటీ తాజాగా 'యానిమల్' చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించింది. తాజాగా ఆమె 'పుష్ప' సెకండ్ పార్ట్ లోనూ నటిస్తోంది. అంతేకాదు, రష్మిక ప్రధాన పాత్రలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ 'రెయిన్ బో' చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.
Rashmika Mandanna
Instagram
Followers
Tollywood

More Telugu News