Doctors: తెలంగాణ ఎన్నికల్లో డాక్టర్ల హవా
- తెలంగాణలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు
- ఎమ్మెల్యేలుగా గెలిచిన 15 మంది డాక్టర్లు
- అత్యధికంగా కాంగ్రెస్ నుంచి 11 మంది వైద్యుల గెలుపు
వైద్యో నారాయణో హరిః అన్నారు. వైద్యుడి ప్రాముఖ్యతను చెప్పడానికి ఆ వాక్యం చాలు. సమాజంలో వైద్యుడి పాత్ర ఎనలేనిది. ప్రాణాలు కాపాడే డాక్టర్ ను ప్రత్యక్ష దైవం అంటే సరిపోతుంది. అయితే డాక్టర్లు స్టెతస్కోపును వదిలి రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి వారు ముఖ్యమంత్రిగానూ పనిచేశారు.
ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ఏకంగా 15 మంది డాక్టర్లు విజయం సాధించారు. వారిలో వివిధ పార్టీలకు చెందిన వారున్నారు. 11 మంది కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కాగా, బీఆర్ఎస్ పార్టీకి చెందినవారు ముగ్గురున్నారు. ఒకరు బీజేపీ ఎమ్మెల్యే. అందులోనూ ముగ్గురు ఆర్థోపెడిక్ స్పెషలిస్టులు ఉన్నారు.
- డాక్టర్ వివేక్ వెంకటస్వామి (కాంగ్రెస్- చెన్నూరు)
- డాక్టర్ రాంచందర్ నాయక్ (కాంగ్రెస్- డోర్నకల్)
- డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి (కాంగ్రెస్- నాగర్ కర్నూల్)
- డాక్టర్ వంశీకృష్ణ (కాంగ్రెస్- అచ్చంపేట)
- డాక్టర్ ఎం.రాగమయి (కాంగ్రెస్- సత్తుపల్లి)
- డాక్టర్ మురళీ నాయక్ (కాంగ్రెస్- మహబూబాబాద్)
- డాక్టర్ భూపతి రెడ్డి (కాంగ్రెస్- నిజామాబాద్ రూరల్)
- డాక్టర్ కె.సత్యనారాయణ (కాంగ్రెస్- మానకొండూరు)
- డాక్టర్ మైనంపల్లి రోహిత్ (కాంగ్రెస్- మెదక్)
- డాక్టర్ పర్ణికా రెడ్డి (కాంగ్రెస్- నారాయణపేట)
- డాక్టర్ సంజీవ రెడ్డి (కాంగ్రెస్- నారాయణఖేడ్)
- డాక్టర్ సంజయ్ కుమార్ (బీఆర్ఎస్- జగిత్యాల)
- డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ (బీఆర్ఎస్- కోరుట్ల)
- డాక్టర్ తెల్లం వెంకట్రావు (బీఆర్ఎస్- భద్రాచలం)
- డాక్టర్ పాల్వాయి హరీశ్ (బీజేపీ- సిర్పూర్)