Revanth Reddy: రేవంత్ రెడ్డికి నా ఎంపీ ఫ్లాట్ లో ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉంది: మాణికం ఠాగూర్

 It is my pleasure to host Revanth Reddy in my MP flat says Manickam Tagore
  • ఢిల్లీలో బిజీబిజీగా రేవంత్ రెడ్డి
  • మాణికం ఠాగూర్ ను కలిసి ప్రమాణస్వీకారానికి ఆహ్వానించిన రేవంత్
  • రాష్ట్రాన్ని రేవంత్ అభివృద్ధి పథం వైపు తీసుకెళ్తారనే నమ్మకం ఉందన్న మాణికం
సీఎల్పీ నేతగా ఎంపికైన రేవంతర్ రెడ్డి రేపు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర రెండో సీఎంగా ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. మరోవైపు ప్రస్తుతం రేవంత్ ఢిల్లీలో ఉన్నారు. పార్టీ పెద్దలను కలిసి, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ ఇన్ఛార్జీ మాణికం ఠాగూర్ ను రేవంత్ కలిసి, ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా మాణికం ఠాగూర్ స్పందిస్తూ.... ఒక సోదరుడిగా తెలంగాణ ముఖ్యమంత్రికి తన ఎంపీ ఫ్లాట్ లో ఆతిథ్యం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. రేపు హైదరాబాద్ లో జరిగే చారిత్రాత్మక ఘట్టానికి తనను ఆహ్వానించడానికి రేవంత్ వచ్చారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఉన్నత శిఖరాలకు ఎక్కించినట్టే... రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పథం వైపు నడిపిస్తారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు.  
Revanth Reddy
Manickam Tagore
Congress

More Telugu News