Karnisena: సోషల్ మీడియాలో వైరల్గా మారిన కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ హత్య వీడియో
- సీసీ కెమెరాలో రికార్డు అయిన హత్య దృశ్యాలు
- అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డ దుండగులు
- రాజస్థాన్ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్
రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్య రాజస్థాన్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన, ఇతర కమ్యూనిటీ సంస్థలు బుధవారం రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో రాష్ట్రమంతటా బంద్ వాతావరణం కనిపిస్తోంది. సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్యపై న్యాయ విచారణ చేయాలని కర్ణిసేన డిమాండ్ చేస్తోంది. కాగా మంగళవారం సుఖ్దేవ్ హత్య సంచలనం సృష్టించింది.
ఆయనను కలవాలంటూ ఇంట్లోకి వచ్చిన దుండగులు మాట్లాడుతుండగానే అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ఆయనని హాస్పిటల్కు తరలించినా ఫలితం దక్కలేదన్నారు. కాగా ముగ్గురు దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారని, కొద్దిసేపు మాట్లాడిన అనంతరం కాల్పులు జరిపారని పోలీసులు వివరించారు. సుఖ్దేవ్ భద్రతా సిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో దుండగుడు చనిపోగా ఇద్దరు పరారయ్యారు. సుఖ్దేవ్ హత్యకు తానే బాధ్యత వహిస్తున్నట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు రోహిత్ గోదారా ప్రకటించుకున్న విషయం తెలిసిందే.
ఇదిలావుండగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దుండుగులు సుఖ్దేవ్పై కాల్పులు జరపడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. సోఫాలో కూర్చొని సెల్ఫోన్ చూస్తున్న సమయంలో ఉన్నపళంగా దాడికి తెగబడ్డారు. అక్కడికక్కడే ఆయన కుప్పకూలడం వీడియోలో స్పష్టంగా కనిపించింది.