CM Jagan: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం జగన్ పర్యటన

CM Jagan will tour in cyclone hit areas
  • ఏపీపై విరుచుకుపడిన మిగ్జామ్ తుపాను
  • బాపట్ల వద్ద తీరం దాటిన వైనం
  • పలు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిన తుపాను
బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జామ్ తీవ్ర తుపాను కోస్తాంధ్ర జిల్లాల్లో విలయం సృష్టించిన సంగతి తెలిసిందే. తీరం దాటిన తర్వాత కూడా అది ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం చూపింది. మరికొన్నిరోజుల్లో పంట చేతికొస్తుందనగా, మిగ్జామ్ విరుచుకుపడడంతో రైతాంగం భారీగా నష్టపోయింది. పలుచోట్ల తుపాను ప్రభావంతో ప్రాణనష్టం కూడా జరిగింది. రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చెట్లు విరిగిపడి విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. 

ఈ నేపథ్యంలో, సీఎం జగన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రేపు (డిసెంబరు 8) పర్యటించనున్నారు. తిరుపతి జిల్లా గూడూరు, బాపట్ల జిల్లాల్లో సీఎం పర్యటన సాగనుంది. తమిళనాడు, ఏపీ రాష్ట్రాలపై విరుచుకుపడిన మిగ్జామ్ తీవ్ర తుపాను బాపట్ల వద్ద తీరం దాటిన సంగతి తెలిసిందే.
CM Jagan
Cyclone
YSRCP
Andhra Pradesh

More Telugu News