Stock Market: ఏడు రోజుల వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
- 132 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 36 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ల 7 రోజుల వరుస లాభాలకు ఈరోజు తెరపడింది. మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూడంతో మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. మరోవైపు రేపు ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు వెలువడనున్న తరుణంలో మదుపరులు అప్రమత్తతను పాటించారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 132 పాయింట్లు నష్టపోయి 69,521కి పడిపోయింది. నిఫ్టీ 36 పాయింట్లు కోల్పోయి 20,90 వద్ద స్థిరపడింది.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.43%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.62%), టైటాన్ (1.10%), ఎన్టీపీసీ (1.03%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.62%),
భారతి ఎయిర్ టెల్ (-2.46%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.80%), టాటా స్టీల్ (-1.37%), ఐటీసీ (-1.06%), ఎల్ అండ్ టీ (-0.91%).