group 2: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త... గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- కొత్త సిలబస్ ప్రకారం గ్రూప్ 2 పరీక్షలు ఉంటాయని ఎపీపీఎస్సీ వెల్లడి
- 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు సహా 897 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- జనవరి 10 వరకు దరఖాస్తుల స్వీకరణ
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, ఆ పై విద్యార్ఙత కలిగిన వారు ఉద్యోగాలకు అర్హులు. కొత్త సిలబస్ ప్రకారం గ్రూప్ 2 పరీక్షలు ఉంటాయని ఏపీపీఎస్సీ తెలిపింది. మొత్తం 897 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. గ్రూప్ 2 ఉద్యోగాలకు స్క్రీనింగ్ పరీక్ష ఫిబ్రవరి 25న నిర్వహించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్స్‌కు షార్ట్ లిస్ట్ చేస్తారు. మెయిన్ పరీక్షలను ఆ తర్వాత ప్రకటిస్తారు. మెయిన్ రాత పరీక్ష మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్స్ పరీక్ష నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష రెండూ ఆఫ్ లైన్ మోడ్‌లో నిర్వహిస్తారు.