Ramcharan: రామ్ చరణ్ సినిమాలో నటించాలనుకుంటున్నారా? .. అయితే ఇది మీ కోసమే!   

Casting call for Ram Charan movie
  • రామ్ చరణ్ 16వ సినిమాను నిర్మించనున్న మైత్రీ మూవీ మేకర్స్
  • ఉత్తరాంధ్ర గ్రామీణ యాస మాట్లాడే వారికి ఈ సినిమాలో నటించే అవకాశం
  • అన్ని వయసుల వారికి అవకాశం ఉందని ప్రకటన
'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ హీరోగా ఎదిగిన రామ్ చరణ్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గేమ్ ఛేంజర్' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ నుంచి బిగ్ అనౌన్స్ మెంట్ వచ్చింది. చెర్రీ 16వ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నటించేందుకు కొత్త నటులకు మైత్రీ మూవీ మేకర్స్ ఆహ్వానం పలికింది. ఉత్తరాంధ్ర గ్రామీణ యాస మాట్లాడగలిగి, నటనపై ఆసక్తి ఉన్న వారి కోసం చూస్తున్నామని తెలిపింది. అన్ని ఏజ్ గ్రూపుల వారికి (పురుషులు, మహిళలు) అవకాశం ఉందని ప్రకటించింది. ఒక నిమిషం యాక్టింగ్ వీడియోను, 3 ఫొటోలను, కాంటాక్ట్ డీటెయిల్స్ ను [email protected] కు మెయిల్ చేయవచ్చని లేదా వాట్సాప్ నెంబర్ 91 8143682909కు పంపించవచ్చని తెలిపింది. రీల్స్, సెల్ఫీలు పరిశీలించబడవని ప్రకటనలో పేర్కొంది. 

Ramcharan
Tollywood
RC16
Mythri Movie Makers
Casting Call

More Telugu News