Bhavya Bishnoi: ఐఏఎస్ అధికారిణితో ఎమ్మెల్యే పెళ్లి... 3 లక్షల మందికి ఆహ్వానం

MLA weds IAS as invitations sent to three lakh people

  • గతంలో హీరోయిన్ మెహ్రీన్ తో ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్ నిశ్చితార్థం
  • కొన్ని నెలలకే క్యాన్సిల్
  • ఇప్పుడు ఐఏఎస్ అధికారిణి పరి బిష్ణోయ్ తో ఏడడుగులు వేయనున్న భవ్య
  • డిసెంబరు 22న పెళ్లి... మూడు చోట్ల రిసెప్షన్
  • ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు భారీ ఎత్తున ఆహ్వానాలు

ఉన్నత స్థాయి వ్యక్తుల పెళ్లికి అతిథులకు కొదవ ఉండదు. హర్యానా ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్, ఐఏఎస్ అధికారిణి పరి బిష్ణోయ్ పెళ్లి చేసుకోబోతుండగా, వీరి పెళ్లికి రెండు రాష్ట్రాల నుంచి 3 లక్షల మందిని ఆహ్వానిస్తున్నారు. భవ్య బిష్ణోయ్ హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు. భవ్య బిష్ణోయ్ పేరు వినిపించడం ఇదే కొత్త కాదు. అతడికి గతంలో టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ తో నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ, కొన్ని నెలలకే అది రద్దయింది. 

భవ్య బిష్ణోయ్ బీజేపీ యువ నేత. అదరంపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక పరి బిష్ణోయ్ స్వస్థలం రాజస్థాన్. ఆమె 2019లో సివిల్స్ కు ఎంపికై సిక్కిం క్యాడర్ కింద విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు భవ్య బిష్ణోయ్, పరి వివాహంతో ఒక్కటి కాబోతున్నారు. వీరి నిశ్చితార్థం గత ఏప్రిల్ లో జరిగింది. డిసెంబరు 22న వీరి పెళ్లి జరగనుంది. 

కాగా, ఈ పెళ్లి కోసం పుష్కర్, అదంపూర్, ఢిల్లీలో వేర్వేరుగా రిసెప్షన్లు నిర్వహిస్తున్నారు. ఢిల్లీతో పాటు హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి 3 లక్షల మందిని ఆహ్వానిస్తున్నారు. భవ్య బిష్ణోయ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక్క అదంపూర్ నియోజకవర్గంలోనే 80 గ్రామాల ప్రజలను విందుకు పిలుస్తున్నారు. 

ఈ పెళ్లి ఐఏఎస్ అధికారిణి పరి బిష్ణోయ్ సొంత రాష్ట్రం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరగనుంది.

  • Loading...

More Telugu News