Renu Desai: నా పేరు వాడుకుని నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావ్: రేణుదేశాయ్ ఫైర్

Renu Desai fires on a journalist
  • రేణు దేశాయ్ గురించి గాసిప్స్ ప్రచారం చేస్తున్న ఓ జర్నలిస్ట్
  • గాసిప్స్ కాకుండా మీ ప్రతిభతో డబ్బులు సంపాదించాలని రేణు హితవు
  • పురుషులు లేకుండా స్త్రీలు బతకలేరన్నట్టుగా మాట్లాడుతున్నారని మండిపాటు
ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఓ సీనియర్ జర్నలిస్ట్ రేణు రీఎంట్రీ, ఆమె వ్యక్తిగత విషయాలపై సంచలన కామెంట్స్ చేశారు. దీంతో, ఆయనపై రేణు నిప్పులు చెరిగారు. సోషల్ మీడియా ద్వారా ఆమె స్సందిస్తూ... అంకుల్, మీరు నా నామస్మరణ చేస్తూ వ్యూస్ సాధిస్తున్నారని విమర్శించారు. నా పేరు వాడుకుంటూ మీరు డబ్బులు సంపాదిస్తుండటం తనకు సంతోషమేనని... అయితే, నటులపై గాసిప్స్ చెప్పకుండా... మీ ప్రతిభతో డబ్బులు సంపాదిస్తే బాగుంటుందని చెప్పారు. సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుందని అన్నారు. తనను మీరు ఎప్పుడూ కలవలేదని, తన గురించి కూడా మీకు ఏమీ తెలియదని, అయినా తన గురించి ఏదో చెపుతుంటారని దుయ్యబట్టారు. మన సంప్రదాయాల్లో మహిళలను దుర్గాదేవి, కాళీమాతగా భావిస్తారని... మీలాంటి వాళ్లు మాత్రం పురుషులు లేకుండా స్త్రీలు ఏమీ చేయలేరని మాట్లాడుతుంటారని మండిపడ్డారు.
Renu Desai
Tollywood

More Telugu News