Mallu Bhatti Vikramarka: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేస్తాం.. బీఆర్ఎస్ పాలన అంతా అస్తవ్యస్తమే: మల్లు భట్టి విక్రమార్క
- కేసీఆర్ పాలనలో ఫ్యూడల్ వ్యవస్థ ఏర్పడిందన్న భట్టి
- రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలను ప్రారంభించామని వెల్లడి
- ఐటీ, పరిశ్రమలు, సేవా రంగాలను ప్రోత్సహిస్తామని వ్యాఖ్య
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులు బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలను స్వీకరించిన వెంటనే అందరూ కూడా తమ కార్యాచరణను మొదలు పెట్టారు. తాజాగా డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు. మధిర నియోజకవర్గం ప్రజల అండతోనే తాను ఉన్నతమైన పదవిని చేపట్టానని చెప్పారు. ఒక చారిత్రక విజయం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. మధిర క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.