DK Shivakumar: నటుడు శివరాజ్ కుమార్‌కు డీకే శివకుమార్ బంపర్ ఆఫర్.. భార్య పేరును సూచించిన నటుడు!

DKS offers Shivarajkumar Lok Sabha election ticket
  • ఆర్యా ఈడిగ సమావేశంలో పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎం, శివరాజ్ కుమార్
  • లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించిన డిప్యూటీ సీఎం
  • సున్నితంగా ఆఫర్ తిరస్కరించిన శివరాజ్ కుమార్
  • తన భార్యకు రాజకీయాలపై ఆసక్తి ఉంది.. ఆమెకు ఇచ్చే విషయమై పరిశీలించాలన్న శివరాజ్ కుమార్
ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్‌కు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బహిరంగంగా ఓ ఆఫర్ ఇచ్చారు. బెంగళూరులో ఆదివారం ఆర్యా ఈడిగ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్, శివరాజ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్ మాట్లాడుతూ... వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు శివరాజ్ కుమార్ సిద్ధంగా ఉండాలని తాను సూచించానన్నారు. కానీ ఆయన ఇప్పటికే అంగీకరించిన సినిమాలు పూర్తి చేయవలసి ఉందన్నారు. ఆయనకు నేను చెప్పేది ఒకే విషయమని, సినిమాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చునని, కానీ పార్లమెంట్‌కు వెళ్లే గొప్ప అవకాశం అందరికీ రాదన్నారు. మీ తలుపుతట్టిన అవకాశాన్ని వదులుకోవద్దని శివరాజ్ కుమార్‌కు సూచించారు. ఇలాంటి అవకాశాన్ని వదులుకోవద్దని, మా ఆఫర్‌ను పరిశీలించండని కోరారు. 

డీకే ఆఫర్‌పై శివరాజ్ కుమార్ వేదిక మీద స్పందించలేదు. కానీ తర్వాత డీకే శివకుమార్‌తో భేటీ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. లోక్ సభ ఆఫర్‌ను తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. ముఖానికి రంగులేసుకొని నటించడం తన తండ్రి ఇచ్చిన బహుమతి అని, ప్రత్యక్ష రాజకీయాలకు తాము దూరమని, రాజకీయంగా తనకు ఉన్న ఏకైక బంధం తాను మాజీ సీఎం బంగారప్ప కూతురును పెళ్ళి చేసుకోవడమేనని, ఆమెకు మాత్రం రాజకీయాలపై ఆసక్తి ఉంది.. కాబట్టి ఆమెను ప్రోత్సహిస్తానని, మీరు టిక్కెట్ ఇచ్చే అంశాన్ని పరిశీలించవచ్చునని చెప్పినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.
DK Shivakumar
Telangana
shivaraj kumar
Karnataka

More Telugu News