Under-19 World Cup: అండర్-19 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ... వేర్వేరు గ్రూపుల్లో భారత్, పాక్ జట్లు

ICC releases Under 19 World Cup Schedule

  • జనవరి 19 నుంచి జూనియర్ వరల్డ్ కప్
  • దక్షిణాఫ్రికా వేదికగా టోర్నీ
  • ఏ గ్రూపులో భారత్... డి గ్రూపులో పాకిస్థాన్
  • ఫిబ్రవరి 11న ఫైనల్ మ్యాచ్

త్వరలో మరో క్రికెట్ సంరంభానికి తెర లేవనుంది. దక్షిణాఫ్రికా గడ్డపై ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ జరగనుంది. 2024 జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు టోర్నీ నిర్వహించనున్నారు. ఈ జూనియర్ మెగా ఈవెంట్ లో మొత్తం 41 మ్యాచ్ లు నిర్వహించనున్నారు. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. భారత యువ జట్టు ఏ గ్రూపులో ఉండగా, దాయాది పాకిస్థాన్ జట్టు డి గ్రూపులో ఉంది.

ఏ గ్రూపు- భారత్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, అమెరికా
బి గ్రూపు- ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్లాండ్
సి గ్రూపు- ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, నమీబియా
డి గ్రూపు- ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, న్యూజిలాండ్, నమీబియా

గ్రూపు దశలో ఒక్కో జట్టు  మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. సాధించిన విజయాల ఆధారంగా ఒక్కో గ్రూపు నుంచి మూడు జట్లు సూపర్ సిక్స్ దశకు అర్హత సాధిస్తాయి. సూపర్ సిక్స్ దశలో ఏ గ్రూపు నుంచి వచ్చిన  జట్లు... డి గ్రూపు నుంచి వచ్చిన జట్లతో తలపడతాయి. బి గ్రూపు నుంచి వచ్చిన జట్లు... సి గ్రూపు నుంచి వచ్చిన జట్లతో ఆడతాయి. ఇందులో మెరుగైన 4 జట్లు సెమీస్ చేరుకుంటాయి. ఫిబ్రవరి 11న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్ డే కూడా కేటాయించారు.

  • Loading...

More Telugu News