Tammineni Sitaram: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాపై స్పీకర్ తమ్మినేని ఏమన్నారంటే..!

Speaker Tammineni response on Alla Ramakrishna Reddy resignation
  • ఎమ్మెల్యే పదవికి, వైసీపీ సభ్యత్వానికి ఆర్కే రాజీనామా
  • ఎందుకు రాజీనామా చేశారో తెలుసుకుంటానన్న తమ్మినేని
  • రాజీనామాను ఆమోదించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయని వ్యాఖ్య
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేయడం కలకలం రేపింది. స్పీకర్ తమ్మినేని సీతారాం ఓఎస్డీకి తన రాజీనామా లేఖను ఆర్కే స్వయంగా అందజేశారు.

 రాజీనామాపై తమ్మినేని స్పందిస్తూ... ఆర్కేతో స్వయంగా మాట్లాడి రాజీనామా ఎందుకు చేశారో తెలుసుకుంటానని ఆయన తెలిపారు. ఆయన ఎందుకు రాజీనామా చేశారో తనకు తెలియదని చెప్పారు. రాజీనామాను ఆమోదించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయని అన్నారు. నిబంధనలకు అనుగుణంగానే తాను వ్యవహరిస్తానని చెప్పారు. 

మరోవైపు, రాజీనామా చేసిన అనంతరం ఆర్కే ఎవరికీ అందుబాటులో లేరని తెలుస్తోంది. తన ఫోన్ ను ఆయన స్విచ్చాఫ్ చేసుకున్నారని చెపుతున్నారు. ఇంకోవైపు, మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జీగా గంజి చిరంజీవిని జగన్ నియమించారు.
Tammineni Sitaram
Alla Ramakrishna Reddy
YSRCP
Resignation

More Telugu News