AP Govt: ఏపీలో సమ్మెలోకి అంగన్ వాడీలు
- రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు విఫలం
- జిల్లా కేంద్రాల్లో వర్కర్లు, హెల్పర్ల ఆందోళన
- వేతనాల పెంపు, గ్రాట్యుటీ కోసం డిమాండ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మె బాట పట్టారు. మంగళవారం నుంచి అంగన్ వాడీ కేంద్రాలను మూసివేసి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల ముందు ఆందోళన చేపట్టనున్నారు. మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శన చేపడుతున్నారు. ఈమేరకు అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లకు సంబంధించిన 3 సంఘాలు ఓ ప్రకటన విడుదల చేశాయి.
ప్రధానంగా వేతనాల పెంపు, గ్రాట్యుటీ కోసం డిమాండ్ చేస్తున్న వర్కర్లు.. అంగన్ వాడీలలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపిస్తున్నారు. హెల్త్ కార్డులు ఇవ్వలేదని మండిపడుతున్నారు. అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల ఆందోళన సమ్మెకు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది.