Telangana High Court: మహిళలను మసీదుల్లోకి అనుమతించండి: తెలంగాణ హైకోర్టు

Telangana asks shia woman to be allowed into places of worship

  • ప్రార్థనా మందిరాల్లో షియా మహిళలను అనుమతించాలంటూ పిటిషన్
  • ఇబ్దత్‌ఖానాకు చెందిన ముత్తవల్లీల కమిటీ కేవలం షియా మహిళలకే అనుమతి నిరాకరిస్తోందని వాదన
  • ఖురాన్ ప్రకారమే అనుమతులు ఉంటాయన్న వక్ఫ్ బోర్డు
  • స్త్రీలపై వివక్ష కూడదంటూ హైకోర్టు తీర్పు

మహిళలను మసీదుల్లోకి అనుమతించాలని తెలంగాణ హైకోర్టు తాజాగా పేర్కొంది. మసీదు. జాషన్స్, ఇతర ప్రార్థనా మందిరాల్లోకి షియా తెగకు చెందిన మహిళలను అనుమతించాలంటూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

షియా ముస్లిం మహిళలను మసీదు, ఇతర పవిత్ర ప్రాంతాల్లో ప్రార్థనలకు అనుమతించట్లేదంటూ ‘అంజుమన్ ఎ అలవి షియా ఇమామియా ఇత్నా అశరి (అక్బరీ) సొసైటీ’ కార్యదర్శి ఆస్మా ఫాతిమా హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై హైకోర్టు జడ్జి జస్టిస్ నగేశ్ భీమపాక సోమవారం విచారణ చేపట్టారు. ఇబ్దత్‌కానాకు చెందిన ముత్తవల్లీల కమిటీ కేవలం షియా తెగకు చెందిన మహిళలను ప్రార్థనా మందిరాలకు అనుమతించడంలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో వక్ఫ్ బోర్డుకు వినతి పత్రాలు అందించినప్పటికీ ఉపయోగం లేకపోయిందని చెప్పారు. 

మరోవైపు, ఖురాన్ ప్రకారమే ప్రార్థనా మందిరాల్లోకి అనుమతి ఉంటుందని వక్ఫ్ బోర్డు తరపు న్యాయవాది పేర్కొన్నారు. 

అయితే, మహిళలపై వివక్ష ప్రదర్శించడం తగదని, రాజ్యాంగం వారికి సమానత్వ హక్కులు కల్పించిందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో షియా మహిళలను ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించాలంటూ ముత్తవల్లీ కమిటీని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News