Monkey: నిజామాబాద్‌లో దారుణం.. కోతులను వండుకుని తిన్న వారిపై గ్రామస్థుల దాడి!

Some killed Monkeys cooked and eaten in Nizamabad
  • నిజామాబాద్ జిల్లా చింతలబోరి గ్రామంలో ఘటన
  • నాలుగు కోతులను వండుకుతిన్న వైనం
  • సంచార జాతుల వారిగా అనుమానం
  • పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్న గ్రామస్థులు
నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని చింతలబోరి గ్రామంలో కొందరు వ్యక్తులు కోతులను చంపి తినడం కలకలం రేపింది. నాలుగు కోతులను పట్టుకుని చంపి వండుకుని తిన్నవారిని గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. వీరు సంచార జాతులకు చెందినవారని అనుమానిస్తున్నారు.

కోతులను తాము దైవంతో సమానంగా పూజిస్తామని, వాటిని చంపితినడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ శివారులోని వారి గుడారాల వద్దకు వెళ్లి గొడవకు దిగారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు గ్రామస్థులు తెలిపారు.
Monkey
Nizamabad District
Telangana

More Telugu News