Meruga Nagarjuna: రాజీనామా చేసినా ఆర్కే మా పార్టీ వ్యక్తే: మంత్రి నాగార్జున
- జగన్ మళ్లీ సీఎం అవుతారన్న మంత్రి నాగార్జున
- ప్రస్తుత పరిస్థితుల కారణంగా తనను సంతనూతలపాడు ఇంఛార్జీగా నియమించారని వ్యాఖ్య
- 175 నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుందని ధీమా
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని... జగన్ మళ్లీ సీఎం అవుతారని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. వ్యక్తిగత కారణాల వల్లే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారని చెప్పారు. ఆర్కే రాజీనామా చేసినప్పటికీ ఆయన తమ పార్టీవారేనని అన్నారు. ప్రభుత్వంపై ఎమ్మెల్యేలు ఎవరికీ అసంతృప్తి లేదని చెప్పారు. జగన్ బొమ్మతోనే తాను గెలిచానని, మంత్రిని అయ్యానని తెలిపారు. వేమూరు నియోజకవర్గం నుంచి మూడు సార్లు పోటీ చేశానని... అయితే, ప్రస్తుత పరిస్థితుల కారణంగా సంతనూతలపాడు నియోజకవర్గానికి తనను ఇన్ఛార్జీగా నియమించారని చెప్పారు. జగన్ ఎక్కడ పోటీచేయమని ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తానని తెలిపారు. 175 నియోజకవర్గాల్లో వైసీపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు తిరుమల శ్రీవారిని నాగార్జున దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పైశ్యాఖ్యలు చేశారు.