OTT: ఓటీటీలలో ఈ ఏడాది ఎక్కువమంది చూసిన షోలు ఇవే..!

The Most Watched Movies On OTT In 2023

  • జాబితా విడుదల చేసిన ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్
  • ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది చూసిన వెబ్ సిరీస్ లలో రానా నాయుడుకు 336 స్థానం
  • టాప్ 10 లో భారతీయ సినిమాలు, వెబ్ సిరీస్ లకు దక్కని చోటు

ఓటీటీలలో ఈ ఏడాది ఎక్కువ ప్రేక్షకాదరణ పొందిన సినిమాలు, వెబ్ సిరీస్ లకు సంబంధించి తాజాగా నెట్ ఫ్లిక్స్ ఓ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో టాప్ 10 లో భారతీయ సినిమాలు, సిరీస్ లకు చోటు దక్కలేదు. విమర్శలను మూటగట్టుకున్న ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ కు ఈ జాబితాలో 336 వ స్థానం దక్కడం విశేషం. విక్టరీ వెంకటేశ్, రానా నటించిన ఈ సిరీస్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. అయితే, నెట్ ఫ్లిక్స్ జాబితాలో స్థానం సంపాదించుకున్న ఏకైక ఇండియన్ వెబ్ సిరీస్ గా ‘రానా నాయుడు’ రికార్డు నెలకొల్పింది. ఈ సిరీస్ కు 46 మిలియన్ల గంటల వ్యూస్ వచ్చినట్లు నెట్ ఫ్లిక్స్ పేర్కొంది. దీని తర్వాతి స్థానాల్లో ‘చోర్ నికల్ కే భాగా’, ‘మిషన్ మజ్నూ’ సినిమాలు టాప్ 400 లో నిలిచాయి. దీని తర్వాత ప్రముఖ రియాల్టీ షో ‘ఇండియన్ మ్యాచ్ మేకింగ్’, ఆర్ఆర్ఆర్ సినిమా, ‘మిస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’, ‘తుఝాటీ మే మక్కర్’, ‘షెహజాదా’ లకు చోటు దక్కింది.

టాప్ 10 సినిమాలు, సిరీస్ లు ఇవే.. (నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం)

1. ది నైట్ ఏజెం ట్ (సీజన్ 1)
2. గిన్నీ అండ్ జార్జియా (సీజన్ 2)
3. ది గ్లోరీ (సీజన్ 1)
4. బుధవారం (సీజన్ 1)
5. క్వీన్ షార్లెట్: ది బ్రిడ్జర్టన్ స్టోరీ
6. యు (సీజన్ 4)
7. లా రీనా డెన్ సుర్ (సీజన్ 3)
8. ఔటర్ బ్యాంక్స్ (సీజన్ 3)
9. గిన్నీ అండ్ జార్జియా (సీజన్ 1)
10. ఫ్యూ బర్ (సీజన్ 1)

  • Loading...

More Telugu News