Gun Fire: బహిరంగంగా మూత్ర విసర్జన.. కూడదన్న వ్యక్తిపై మాజీ సైనికుడి కాల్పులు

Ex Serviceman fires at man for warning for not to urine outside
  • ఢిల్లీలోని బురాలీలో ఘటన
  • రెండు రౌండ్లు కాల్పులు జరిపిన నిందితుడు
  • వారించిన మరో వ్యక్తిపైనా దాడి
బహిరంగ మూత్ర విసర్జన వద్దన్నందుకు ఓ మాజీ సైనికుడు కాల్పులు జరిపాడు. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం రాత్రి జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం బురాలీలోని రాయల్ అపార్ట్‌మెంట్‌కు చెందిన మాజీ సైనికుడు రవీంద్ర బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తుండగా చూసిన అదే అపార్ట్‌మెంట్‌కు చెందిన హేమంత్ ప్రశ్నించాడు. బహిరంగ మూత్ర విసర్జన కూడదని హెచ్చరించారు.

దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన రవీంద్ర చెప్పేందుకు నువ్వెవరవంటూ అతడిపై తుపాకి ఎక్కుపెట్టాడు. రెండు రౌండ్లు కాల్చాడు. కాల్పుల్లో హేమంత్ గాయపడ్డాడు. వారించిన మరో వ్యక్తిపైనా రవీంద్ర దాడికి దిగాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రవీంద్రను నిన్న అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్టు తెలిపారు.
Gun Fire
New Delhi
Ex Serviceman
Crime News

More Telugu News