KCR: యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మాజీ సీఎం కేసీఆర్
- ఈ నెల 8న కేసీఆర్ కు తుంటి ఎముక మార్పిడి చికిత్స
- నందినగర్ లోని నివాసానికి బయల్దేరిన మాజీ సీఎం
- ఇంట్లో విశ్రాంతి తీసుకోనున్న కేసీఆర్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రం ప్రగతి భవన్ నుంచి నేరుగా ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఆ తర్వాత ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో ఆయన ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కాలి తుంటి ఎముక విరిగింది. దీంతో, ఆయనను ఫామ్ హౌస్ నుంచి హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు.