Nara Lokesh: ఈ నెల 20న లోకేశ్ యువగళం ముగింపు సభ... ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన టీడీపీ

Special Trains for Nara Lokesh Yuvagalam victory rally
  • జనవరి 27 నుంచి కొనసాగుతున్న లోకేశ్ యువగళం
  • ప్రస్తుతం ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న పాదయాత్ర
  • మరి కొన్ని రోజుల్లో ముగింపు
  • భోగాపురం సమీపంలోని పోలేపల్లి వద్ద విజయోత్సవ సభ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరి కొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో, యువగళం విజయోత్సవ సభను డిసెంబరు 20న భోగాపురం సమీపంలోని పోలేపల్లిలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కూడా వస్తుండడంతో భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. 

పొత్తు అనంతరం చంద్రబాబు, పవన్, లోకేశ్, నందమూరి బాలకృష్ణ ఒకే వేదిక మీదికి వస్తుండడంతో ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో, టీడీపీ 7 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ రైళ్లు డిసెంబరు 19న తిరుపతి, రైల్వే కోడూరు, మాచర్ల, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఆదోని నుంచి బయల్దేరి విజయనగరం చేరుకుంటాయి. 

అంతేకాదు, ఆర్టీసీ నుంచి అద్దె బస్సులు ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆర్టీసీ ఉన్నతాధికారులకు లేఖ రాశారు.
Nara Lokesh
Yuva Galam Padayatra
Special Trains
Buses
TDP
Chandrababu
Pawan Kalyan
Balakrishna
Janasena
Andhra Pradesh

More Telugu News