indira park: ఎవరైనా ధర్నా చేసుకోవచ్చు.. ఇందిరాపార్క్ వద్ద అనుమతి ఉంది: హైదరాబాద్ పోలీస్ కమిషనర్
- ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ధర్నాలు చేసుకునే హక్కు ఉందన్న పోలీస్ కమిషనర్
- శాంతియుతంగా ధర్నాలు చేస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని వ్యాఖ్య
- ధర్నాలు చేసే వారి సమస్యలను తాము ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామన్న పోలీస్ కమిషనర్
ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ధర్నాలు చేసుకునే హక్కు ఉందని.. ఇందిరా పార్క్ వద్ద ధర్నాలకు అనుమతి ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా శాంతియుత నిరసన తెలిపే హక్కు ఉందన్నారు. శాంతియుతంగా ధర్నాలు చేస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ధర్నాలు చేసే వారి సమస్యలను తాము ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామన్నారు. ధర్నా చౌక్ అంశంపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్లు పెండింగులో ఉన్నట్లు తెలిపారు. వాటికి సంబంధించి న్యాయపరమైన అంశాలను న్యాయస్థానానికి వివరిస్తామన్నారు. అలాగే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యపై కూడా సమీక్ష చేస్తున్నట్లు తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి ఈ రోజు 8 వేల మందికి పైగా హాజరైనట్లు తెలిపారు.