Deepak Chahar: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. బీసీసీఐ కీలక ప్రకటన

Deepak Chahar withdrawn and Mohd Shami ruled out BCCI announce
  • బీసీసీఐ మెడికల్ టీమ్ ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో టెస్టు సిరీస్‌కు దూరమైన స్టార్ పేసర్ మహ్మద్ షమీ
  • ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండలేనని సమాచారం ఇచ్చిన దీపక్ చాహర్
  • వన్డే జట్టుకు భారత ఏ జట్టు సిబ్బంది సహాయం.. టెస్టు జట్టుతో కలవనున్న ప్రధాన కోచింగ్ సిబ్బంది
మరో పది రోజుల్లో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్ కప్ 2023లో అదరగొట్టిన స్టార్ పేసర్ మహ్మద్ షమీ టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. షమీ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ మెడికల్ టీమ్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో అతడు టెస్టు సిరీస్‌కు దూరమవనున్నాడని బీసీసీఐ హానరరీ సెక్రటరీ జై షా ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. మరోవైపు ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండలేనని దీపక్ చాహర్ తెలియజేశాడని వెల్లడించారు. అతడి స్థానంలో ఆకాష్ దీప్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిందని వివరించారు. కాగా డిసెంబర్ 26 నుంచి టెస్టు సిరీస్‌కు షురూ కానుంది.

దక్షిణాఫ్రికాలో భారత పర్యటనకు సంబంధించిన అప్‌డేట్‌లను బీసీసీఐ వెల్లడించింది. భారత ‘ఏ‘ జట్టు కోచింగ్ స్టాఫ్ వన్డే జట్టుకు సహాయం అందిస్తారని, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్, బౌలింగ్ కోచ్ రాజీబ్ దత్తా, ఫీల్డింగ్ కోచ్ అజయ్ జట్టుతో ఉంటారని వివరించింది. ఇక టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ టెస్టు జట్టుతో కలుస్తారని బీసీసీఐ ప్రకటించింది. టెస్ట్ సిరీస్ జట్టు సన్నాహాలను వీరు పర్యవేక్షించనున్నారని వెల్లడించింది. మరోవైపు డిసెంబరు 17న జోహన్నెస్‌బర్గ్‌లో తొలి వన్డే ముగిసిన తర్వాత శ్రేయాస్ అయ్యర్ టెస్టు సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు టెస్టు జట్టుతో కలవనున్నాడని ప్రకటనలో పేర్కొంది. రెండవ, మూడవ వన్డేల్లో అందుబాటులో ఉండడని బీసీసీఐ తెలిపింది. 

మార్పుల తర్వాత వన్డే జట్లు ఇదే..

రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటీదార్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఆకాష్ దీప్.
Deepak Chahar
Mohd Shami
BCCI
iNDIA vS South africa
Cricket
Team India

More Telugu News