Kishan Reddy: శబరిమలలో తెలుగు భక్తులకు ఇబ్బందులు... కేరళ సీఎంకు కిషన్ రెడ్డి లేఖ

Kishan Reddy wrote Kerala CM Vijayan over devotees problems in Shabarimala
  • శబరిమలకు పోటెత్తుతున్న అయ్యప్ప భక్తులు
  • సరైన సౌకర్యాలు లేవంటూ విమర్శలు
  • భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్న కిషన్ రెడ్డి
  • అవసరమైతే కేంద్ర తరఫున సాయం అందిస్తామని కేరళ సీఎంకు స్పష్టీకరణ
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శబరిమలలో ఏపీ, తెలంగాణ భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయ్యప్ప భక్తులకు సరైన సదుపాయాలు ఏర్పాటు చేయడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. కేరళ సీఎం పినరయి విజయన్ కు కిషన్ రెడ్డి లేఖ రాశారు. శబరిమలలో తెలుగు భక్తులు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. అయ్యప్ప భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సాయం చేస్తామని తెలిపారు. ఇటీవల శబరిమలలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో బాలిక చనిపోవడం బాధాకరమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Kishan Reddy
Shabarimala
Devotees
Pinarayi Vijayan
Kerala
Telangana
Andhra Pradesh

More Telugu News