Somireddy Chandra Mohan Reddy: అక్రమ మైనింగ్ లో సీఎంకు, మంత్రులకు వాటా ఉంది: సోమిరెడ్డి

Somireddy alleges CM and Ministers have share in illegal mining
  • భారత మైకా గనుల్లో వైసీపీ గూండాలు దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు
  • రుస్తుం మైనింగ్ కంపెనీ యజమానితో కలిసి నిరసన చేపట్టిన సోమిరెడ్డి
  • నెల్లూరు జిల్లా పొదలకూరులో నిరసన
అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ నెల్లూరు జిల్లా పొదలకూరులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిరసన చేపట్టారు. సోమిరెడ్డి రుస్తుం మైనింగ్ కంపెనీ యజమాని విద్యాకిరణ్ తో కలిసి ఈ నిరసనలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్ మైకా గనుల్లో వైసీపీ గూండాలు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు గత 3 వారాలుగా అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని, రోజుకు 2 వేల టన్నుల క్వార్ట్జ్ ఖనిజాన్ని దోపిడీ చేస్తున్నారని సోమిరెడ్డి తెలిపారు. అక్రమ మైనింగ్ లో సీఎంకు, మంత్రులకు కూడా వాటా ఉందని ఆరోపించారు.

అక్రమ మైనింగ్ కోర్టు ఆపాలన్నా పట్టించుకోవడంలేదని అన్నారు. దీనికి సంబంధించి మంత్రి కాకాణి, వైసీపీ నేత శ్యాంప్రసాద్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దోపిడీ సొత్తును రెవెన్యూ రికవరీ చట్టం కింద వసూలు చేయాలని సోమిరెడ్డి స్పష్టం చేశారు.
Somireddy Chandra Mohan Reddy
Mining
Podalakuru
TDP
YSRCP
Nellore District

More Telugu News