Sundar Pichai: గతేడాది 12 వేల మంది ఉద్యోగుల తొలగింపు గురించి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వివరణ

Sundar pichai on rationale behind layoffs in google
  • దాదాపు ఏడాది క్రితం గూగుల్‌లో 12 వేల మంది ఉద్యోగుల లేఆఫ్స్
  • లేఆఫ్స్ తప్పలేదని తాజా మీటింగ్‌‌లోొ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడి
  • తొలగింపులు వాయిదా వేసి ఉంటే కీలకరంగాల్లో పెట్టుబడులకు ఆటంకాలు ఏర్పడేవని వెల్లడి
  • లేఆఫ్స్‌తో ఉద్యోగుల నైతికస్థైర్యం దెబ్బతిందని వ్యాఖ్య
గూగుల్‌లో లేఆఫ్స్‌పై సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ తాజాగా స్పందించారు. అప్పట్లో లేఆఫ్స్ తప్పలేదని వ్యాఖ్యానించారు. కంపెనీలో ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దాదాపు ఏడాది క్రితం గూగుల్ ఏకంగా 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అప్పట్లో జాబ్స్ కోల్పోయిన వారి వాటా సంస్థ మొత్తం ఉద్యోగుల్లో ఆరు శాతం.  

ఆర్థికవ్యవస్థలో మార్పుల కారణంగా లేఆఫ్స్ తప్పలేదని సుందర్ పిచాయ్ మీటింగ్‌లో వెల్లడించారు. మారుతున్న అర్థిక పరిస్థితులను తట్టుకుంటూ సంస్థను అభివృద్ధి పథంలో నడిపేందుకు లేఆఫ్స్ అనివార్యంగా మారాయని చెప్పారు. ఉద్యోగుల తొలగింపులు వాయిదా వేసుకుని ఉంటే కీలక రంగాల్లో కంపెనీ పెట్టుబడులకు ఆటంకాలు ఏర్పడేవని ఆయన తెలిపారు. అయితే, లేఆఫ్స్ తరువాత సంస్థలో మిగిలున్న ఉద్యోగుల మానసిక స్థైర్యం తగ్గిన విషయాన్ని కూడా ఆయన అంగీకరించారు. లేఆఫ్స్ జరిగిన తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. తొలగింపులు మరింత మెరుగ్గా నిర్వహించి ఉండాల్సిందని పేర్కొన్నారు.
Sundar Pichai
Google Layoffs

More Telugu News