Solar Company: నాగ్ పూర్ సోలార్ కంపెనీలో పేలుడు.. 9 మంది దుర్మరణం

Nine killed after blast at solar explosive company in Nagpur
  • క్యాస్ట్ బూస్టర్ ప్లాంట్ లో ఘోరం
  • ప్యాకింగ్ చేస్తుండగా పేలుడు
  • ఫ్యాక్టరీకి చేరుకున్న ఎమర్జెన్సీ టీమ్, అధికారులు
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం సోలార్ కంపెనీలో పేలుడు జరిగి తొమ్మిది మంది కార్మికులు చనిపోయారు. నాగ్ పూర్ లోని బజార్ గావ్ గ్రామంలోని సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో ఈ ఘోరం జరిగింది. కంపెనీలోని క్యాస్ట్ బూస్టర్ ప్లాంట్ లో ప్యాకింగ్ సమయంలో సడెన్ గా భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న తొమ్మిది మంది కార్మికులు స్పాట్ లోనే చనిపోయారు.

మరికొంతమంది కార్మికులకు గాయాలయ్యాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. పేలుడు జరిగిన సమాచారం అందగానే ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలు వెంటనే కంపెనీ వద్దకు చేరుకున్నాయి. ప్రమాద తీవ్రత నేపథ్యంలో ఉన్నతాధికారులు కూడా బజార్ గావ్ లోని కంపెనీ వద్దకు చేరుకున్నారు. గాయపడిన కార్మికులను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
Solar Company
Blast
9 dead
Nagpur
Maharashtra
Bazargaon village

More Telugu News