Dawood Ibrahim: అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆసుపత్రి పాలు

Dawood Ibrahim hospitalised in Karachi amidst poisoning speculations

  • కరాచీ ఆసుపత్రిలో చేరిన దావూద్ ఇబ్రహీం
  • ఈ విషయాన్ని వెల్లడించిన పాక్ జియో టీవీ
  • అతడిపై విషప్రయోగం జరిగిందంటూ సోషల్ మీడియాలో కథనాలు

పాక్‌లో తలదాచుకుంటున్న ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆసుపత్రి పాలైనట్టు తెలుస్తోంది. విషప్రయోగం కారణంగా అతడి ఆరోగ్యం క్షీణించినట్టు వదంతులు బయలుదేరాయి. దావూద్ ఇబ్రహీం కరాచీ ఆసుపత్రిలో చేరినట్టు పాక్ జియో టీవీ పేర్కొంది. అతడిపై విషప్రయోగం జరిగినట్టు వ్యాపిస్తున్న వదంతుల గురించి కూడా ప్రస్తావించింది. 

1996లో ముంబై వరుస పేలుళ్లకు కారకుడైన దావూద్ ఇబ్రహీం కరాచీలో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. పాక్ సాయంతో దావూద్.. భారత్‌తో పాటూ అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. 2003లో అతడిపై గ్లోబల్ టెర్రరిస్టుగా ముద్రపడింది. దావూద్ 1955లో మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో జన్మించాడు. ఆ తరువాత కుటుంబం సహా ముంబైకి వలసవెళ్లాడు. 1970ల్లో ముంబై అండర్‌వరల్డ్‌లో అతడు అంచలంచెలుగా ఎదిగాడు. క్రమంగా తన పరపతిని పెంచుకుంటూ వెళ్లాడు. కనీవినీ ఎరుగని దారుణాలకు పాల్పడే అతడి గ్యాంగ్‌కు అప్పట్లో డీ-కంపెనీగా పేరు స్థిరపడింది.

  • Loading...

More Telugu News